కేంద్రం ఉద్యోగులకు తీపి కబురు ఆదాయపు పన్ను స్లాబ్స్ ఇవే

కేంద్రం ఉద్యోగులకు తీపి కబురు ఆదాయపు పన్ను స్లాబ్స్ ఇవే

0
87

ఉద్యోగుల విషయంలో కేంద్రం ప్రకటించే బడ్జెట్ లో ఆదాయపు పన్ను పై కాస్త ఊరట ఇస్తుందా లేదా అనే విషయం పై తెగ ఆలోచిస్తారు…
తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉద్యోగులు ఎలాంటి ప్రకటన వస్తుందా అని చూశారు.. తాజాగా కేంద్రమంత్రి ఆదాయపు పన్ను శ్లాబ్స్ తెలిపారు, మరి ఎలా ఉన్నాయో ఆ రేట్లు చూద్దాం.

రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.

ఇక ఏడాదికి రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం ఆదాయపు పన్నుచెల్లించాలి
రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను చెల్లించాలి
రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్నుచెల్లించాలి
రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్నుచెల్లించాలి

రూ.15లక్షల వరకు ఆదాయమున్న వారికి రూ.78వేలు ప్రయోజనం చేకూరనున్నట్లు మంత్రి తెలిపారు.
పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు ఆమె చెప్పారు. అయితే మీరు కొత్త ట్యాక్స్ విధానం తీసుకుంటే 80 సీ కింద వచ్చే మినహయింపులు మీకు రావు అని తెలిపింది కేంద్రం.