బ్రేకింగ్ న్యూస్ – పదో తరగతి విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ - పదో తరగతి విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్

0
73

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ స‌మ‌యంలో విద్యార్దుల‌కు సంబంధించి ప‌రీక్ష‌లు కూడా వాయిదాప‌డ్డాయి, ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉంది.. కాని లాక్ డౌన్ తో అవి వాయిదా ప‌డ్డాయి, అయితే ఇటీవ‌ల ప‌రీక్ష‌ల పై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూల‌పు సురేష్, ఇక తాజాగా లాక్ డౌన్ మే 17 వ‌రకూ కేంద్రం ప్ర‌క‌టించింది..

దీంతో మ‌రోసారి ప‌రీక్ష‌ల పై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు..బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసిన తరువాతే పదో తరగతి పరీక్షలపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇది విద్యార్దుల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక లాక్ డౌన్ పూర్తి అయిన త‌ర్వాత రెండు వారాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు అని తెలుస్తోంది, ఇక రూమ్ కి 12 లేదా 15 మందిని మాత్ర‌మే ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది, కొత్త‌గా మ‌రిన్ని స్కూళ్ల‌లో ప‌రీక్ష కోసం ఏర్పాట్లు చేయ‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.. సామాజిక దూరం పాట్టిస్తూ మాస్క్ ధ‌రించి ప‌రీక్ష రాసేలా చేయ‌నున్నారట‌.