ఏపీ ప్రభుత్వం శుభవార్త..నేడు ప్రజలకు 1.23 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ

0
100

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది.

ఇవాళ సీఎం జగన్ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ప్రర్యటించనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల 5 నిమిషాలకు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం వేదిక వద్దకు చేరుకోనున్నాడు. ఈ సందర్బంగా సీఎం జగన్ అర్హులైన అభ్యులందరికి  ఇంటి స్థలం అందించాలని నిర్ణయించారు. నేడు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని ఆయన తెలియజేశారు.

కోర్టు కేసుల వల్ల కొన్ని ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్న కారణంగా వాటిని కూడా త్వరగా  పరిష్కారం చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేసాడు. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాన్ని అందించడమే మన లక్షంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు శరవేగంగా పనులు పూర్తి చేయాలనీ తెలిపారు. అంతేకాకుండా నేడు 1.79  లక్షల పి ఎం ఏ వై , వైయస్సార్ గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నామని ఆయన తెలిపారు.