ఏపీ ప్రభుత్వం శుభవార్త..ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే డబ్బులు

0
111

ప్రజలకు మరో శుభవార్త చెప్తూ మనముందుకు వచ్చింది జగన్ సర్కార్. ఆరోగ్యశ్రీ కార్డు దారులకు తీపికబురు చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి  ఆరోగ్య మిత్రలకు  ప్రతిభ ఆధారంగా నగదు అందచేస్తామని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా వైద్య రంగంలో కూడా చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్య ఆసరా కింద పేషంట్స్, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద 16 టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకు వస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నామని తెలిపారు.