ఏపీ విద్యార్థులకు శుభవార్త..విద్యాకానుక కిట్ల పంపిణీ

0
117

ఏపీ విద్యార్థులకు శుభవార్త. రేపటి నుంచి స్టూడెంట్లకు విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఎయిడెడ్‌, సంక్షేమ, గురుకుల, మదరసాలలో చదివే 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఉదయం 10.20 నుంచి 10.30 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వినతిపత్రాలు తీసుకోనున్న సీఎం… 10.45 నుంచి 10.50 వరకు మున్సిపల్ స్కూల్ ను సందర్శించనున్నారు. 10.55 నుంచి 11.15 వరకు నాయకులు, అధికారులను కలవనున్న సీఎం అనంతరం సభలో విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేసి ప్రసంగిస్తారు.

కాగా పాఠశాలలు జూలై 5 నుంచి  పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని సమగ్ర శిక్ష జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 30 వరకు పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. రోజుకు 30 నుంచి 40 కిట్లు బయోమెట్రిక్‌ విధానంలో పంపిణీ చేయాలని ఆదేశించింది.