ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..ఉద్యోగాల భర్తీపై APPSC చైర్మన్ కీలక ప్రకటన

0
136

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. నిన్న గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ సందర్భంగా APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో 110 గ్రూప్-1, 182 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అలాగే ఈ నెల 24న దేవాదాయశాఖకు సంబంధించి ఈవో పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. 31న రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షను నిర్వహించనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరో 13 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. తద్వారా మరో రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టారు. తాజాగా APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మొత్తం 167 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం 67 మంది మహిళలు, 96 మంది పురుషులు వివిధ పోస్టులకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.