బీటెక్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఆ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు అర్హులే!

Good news for BTech students..BTech candidates are eligible for those posts!

0
101
Telangana

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థుల అర్హతపై సోమవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టగా..న్యాయస్థానం బీఈడీ పూర్తి చేసిన బీటెక్‌ అభ్యర్థులు అర్హులని తీర్పునిస్తూ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. బీఈడీ చేసిన బీటెక్‌ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని.. నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని సంబంధిత శాఖకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.