ఉద్యోగులకు శుభవార్త..పరస్పర బదిలీకి సీఎం గ్రీన్ సిగ్నల్

Good news for employees..CM green signal for mutual transfer

0
84

తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు బదిలీపై వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉద్యోగులను బదిలీపై  ప్రభుత్వం తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

క్షమశిక్షణ చర్యలు, విజిలెన్స్‌ కేసులు పెండింగులో ఉన్నవారికి మాత్రం ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది. శాశ్వత బదిలీల కోసం పాటించాల్సిన నిబంధనలపై ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలు చేయాలని ఆదేశించింది. ఉద్యోగులు బదిలీ కోసం వచ్చేనెల 15లోగా ధరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.

పరస్పర బదిలీ ప్రక్రియలో ఒక ఉద్యోగి ఒక్కరికే కన్సెంట్ ఇచ్చే అవకాశం కల్పించారు. ఉద్యోగులు అలాగే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లకు అంగీకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తేదీన ఈ మేరకు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో పరస్పర బదిలీ కోరుకున్న వారికి సీనియారిటీలో రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని పలువురు ఉద్యోగులు, అధికారులు ఏపీకి వెళ్లేందుకు తమను అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొదట్లో డిప్యుటేషన్‌, అంతరాష్ట్ర బదిలీల కింద కొందరిని ఏపీ ప్రభుత్వం అనుమతించింది. తాజాగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించి, వారి శాశ్వత బదిలీకి ఆమోదం తెలిపారు. అందుకనుగుణంగా తాజాగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు దరఖాస్తులను ఐఎఫ్ఎంఐ ఎస్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు.