గ్రూప్ 1 అభ్యర్ధులకు గుడ్ న్యూస్..ఫ్రీ కోచింగ్

0
93

గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 కోసం టి-సాట్ ప్రసారం చేస్తున్న పాఠ్యాంశాలు మరో గంట అదనం ప్రసారం చేస్తున్నామని T-SAT సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ప్రతి రోజూ నాలుగు గంటలు-ఎనిమిది పాఠ్యాంశాలుగా ప్రసారం చేయనున్నామని ప్రకటించారు.

టి సాట్ నిపుణ ఛానల్ లో సాయంత్రం ఆరు గంటల నుండి 10 గంటల వరకు, విద్య ఛానల్ లో ఉదయం ఆరు నుండి 10 గంటల వరకు ప్రసారాలుంటాయని, గతంలో మూడు గంటలుగా ఉన్న ప్రసారాలను మరో గంట అదనంగా ప్రసారం చేస్తున్నామన్నారు. నాలుగు గంటల్లో గంట పాటు ఇంగ్లీష్ పాఠ్యాంశాలుంటాయని వివరించారు. టిఎస్పిఎస్పి (TSPSC) ఆధ్వర్యంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యాక మే ఒకటవ తేదీ నుండే టి-సాట్ బోధనా పాఠ్యాంశ ప్రసారాలు ప్రారంభించిందని తెలిపారు.

ఆంగ్ల భాష ప్రసారాలతో కలిపి మొత్తం 1200 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు. అనుభవం కలిగిన ఫ్యాకల్టీ, ఆధునిక సాంకేతికతో భోధించే పాఠ్యాంశాలను గ్రూప్-1 పోటీ పరీక్షల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సీఈవో శైలేష్ రెడ్డి కోరారు.