టీఎస్: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్!

0
79

తెలంగాణ విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ ​న్యూస్ చెప్పింది. 70 శాతం సిలబస్ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో నమూనా ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. వెబ్‌సైట్‌లో మెటీరియల్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల కెరీర్, ప్రయోజనం కోసమే పరీక్షలు జరుపుతున్నట్లు ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈనెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.

ఇక పదో తరగతిలో గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రభుత్వం ఆరుకు కుదించింది. ద్వితీయ భాష మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు ఇంతకు ముందు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో పరీక్షలో 40 మార్కులు ఉంటున్నాయి. ఈ ఏడాది ప్రథమ భాష, ద్వితీయ భాష, ఆంగ్లం, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్​లు ఇవ్వాలని విద్యా శాఖ స్పష్టం చేసింది.