చంద్రబాబు పుణ్యమా అని ఏపీకి ఎక్కడా పైసా అప్పు ముట్టడం లేదు.. వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఈ సమయంలో ఏపీ సర్కార్ రుణాల కోసం అన్వేషిస్తోంది. తాజాగా జగన్ సర్కారుకి గుడ్ న్యూస్ వచ్చింది.
ఏపీకి రుణం ఇచ్చేందుకు ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఏఐఐబీ ప్రతినిధులు సీఎం జగన్ ని కలిశారు, కొత్తగా మూడు బిలియన్ డాలర్ల రుణం ఇస్తాము అని తెలియచేశారు.
ఏవి ప్రాధాన్యం అనుకుని అనుకుంటున్నారో వాటికి వినియోగించుకోవాలి అని ప్రతినిధులు తెలియచేశారు. ముఖ్యంగా పోర్టులు విమానాశ్రయాలు ప్రాజెక్టులకి సంబంధించి ఆర్ధిక సాయం చేస్తాము అని తెలిపారు, వెంటనే నిధులు కూడా మంజూరు చేసింది.
ఏపీలో పలు పథకాల గురించి సీఎం జగన్ వారికి తెలిపారు..ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం జగన్ ను ఆహ్వానించారు. కొత్తగా 3 పోర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పగా, వాటిలో ఒక పోర్టుకు తాము ఆర్థికసాయం అందజేస్తామని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.