ఇటీవలే సోషల్ మీడియా ట్విట్టర్ లో జనసేన పార్టీకి చెందిన ఖాతాలు సుమారు 400 పైగా సస్పెన్షన్ వేసిన సంగతి తెలిసిందే… దీనిపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు…ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు ఆయన..
ప్రజలకోసం జనసైనికులు నిలబడినందుకే ఈ ఖాతాలను తొలగించారా అని ట్విట్టర్ యజమాన్యాన్ని తొలిసారి పవన్ ప్రశ్నించారు… తమ సామాజిక మాధ్యమ అన్ని ఖాతాల్లో పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
పవన్ ఆవేదనతో చేసిన ట్వీట్ కు ట్విట్టర్ యాజమాన్యం దిగివచ్చింది… సస్పెన్షన్ వేసిన అకౌంట్లు తెరుచుకున్నాయి దీంతో పవన్ ట్విట్టర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
My wholehearted thanks to @TwitterIndia for upholding the constitutional right “Freedom of Expression” by unsuspending all the @Janasenaparty followers twitter accounts and for the timely swift response.