కేసీఆర్ గుడ్ న్యూస్..నేటి నుంచే వారికీ ఆసరా పెన్షన్

0
137

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ సమావేశంలోమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాల రద్దుతో పాటు ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది.

అంతేకాకుండా ఈ నెల 15 నుంచి అనగా నేటి నుండి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఉన్న 36 లక్షల మందితో పాటు అదనంగా దాదాపు 10 లక్షల మందికి పైగా కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామని తెలియజేసారు. మెుత్తం కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు జారీ చేయనుంది.