వాహనదారులకు గుడ్ న్యూస్..సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇక నేరం కాదు!

Good news for motorists

0
121

బండి తీసుకొని బయటికి రావడమే ఆలస్యం. ఏ సందులో నిలబడి ట్రాఫిక్ పోలీసులు ఏ రకంగా ఫైన్లు వేస్తారోననే గుబులు ప్రతి వాహనదారుడికీ ఉంటుంది. చాలా సార్లు చిన్న చిన్న కారణాలకు కూడా జరిమానా కట్టాల్సిన దుస్థితి. ఈ క్రమంలో వాహనదారులకు భారీ ఊరట కలిగించే వార్తను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మామూలుగా మనం డ్రైవింగ్డ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతుంటాం. ఇది చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేరానికి పాల్పడితే చాలా సార్లు భారీ జరిమానాలు కట్టాల్సి రావడం, కొన్ని సార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడమూ విదితమే. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడానికి చట్టబద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు.

“వెహికల్ డ్రైవింగ్ హ్యాండ్ ఫ్రీ డివైస్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడినట్లు అయితే…. అది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడదు. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ జరిమానా విధించడం కుదరదు. ఒకవేళ జరిమానా విధిస్తూ సదరు డ్రైవర్ దాన్ని కోర్టులో సవాలు చేయవచ్చు” అంటూ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

రాబోయే కొత్త చట్టం ప్రకారం డ్రైవర్ ఫోన్ మాట్లాడే సమయంలో హ్యాండ్ సెట్ అతని చేతిలో ఉండకూడదు. హ్యాండ్సెట్ ను పాకెట్ లో పెట్టుకొని హ్యాండ్ ఫ్రీ డెలివరీ ద్వారా అతను ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చు. బ్లూటూత్ లేదా హెడ్సెట్ ద్వారా ఫోన్ మాట్లాడుతున్న ట్రాఫిక్ పోలీసులు జనాలు వేస్తే దానిని కోర్టులో సవాలు చేయవచ్చు. ఈ నిర్ణయం వాహనాలకు ఊరట కలిగిస్తుందని కేంద్రం భావిస్తుందట. దీనిపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.