బ్రేకింగ్ – ఓలా క్యాబ్ కస్టమర్లకు గుడ్ న్యూస్

బ్రేకింగ్ - ఓలా క్యాబ్ కస్టమర్లకు గుడ్ న్యూస్

0
105
OLA

ఇప్పుడు మనం ఎక్కడికి అయినా వెళ్లాలి అంటే, మన ఇంటి గుమ్మం ముందు క్యాబ్ సర్వీసులు వస్తున్నాయి, ఇందులో ఉబెర్ ఓలా క్యాబ్ సర్వీసులు దేశంలో అన్నీ పట్టణాల్లో నగరాల్లో సేవలు విస్తరించాయి, అయితే అంతా ఆన్ లైన్ డిజిటల్ చెల్లింపులతో ఈ సర్వీసులు నిర్వహిస్తున్నాయి.

బుకింగ్స్ కు నగదు ఇవ్వచ్చు ,లేదా ఆన్ లైన్ పే మెంట్ చేయవచ్చు, తాజాగా ఓలా క్యాబ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫోన్పే ద్వారా తమ డిజిటల్ చెల్లింపులు చేయెచ్చు. దీనికి సంబంధించి సోమవారం ఓలా క్యాబ్, ఫోన్పే సంస్థతో వ్యూహాత్మక భాగస్వాయ్యాన్ని ప్రకటించింది.

దీంతో చాలా మంది ఇది బెస్ట్ పే ఆప్షన్ అని అంటున్నారు. ముందు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఫోన్పే చెల్లింపులు కొనసాగించవచ్చు. త్వరలో ఐఓఎస్ ఓఎస్ ఫోన్తో చెల్లింపులు ప్రారంభమవుతాయి.ఇక ఇలా ఒప్పందం చేసుకోవడం వల్ల మరింత మందికి చేరువ అవుతాం అని అంటున్నారు కంపెనీ ప్రతినిధులు..
ఓలా వినియోగదారులకు మొదటి రెండుప్రయాణాలు ఫోన్పే చెల్లింపులో సుమారు రూ. 200 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ వర్తింస్తోందని ఓలా తెలిపింది. సో చూశారుగా ఇకపై ఈ పేమెంట్ కూడా చేసుకోవచ్చు.