అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసేవారికి కేంద్రం గుడ్ న్యూస్

అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసేవారికి కేంద్రం గుడ్ న్యూస్

0
119

అన్ లాక్ 1 ఇక నేటితో ముగుస్తుంది.. జూలై 1 నుంచి అన్ లాక్ 2 పిరియ‌డ్ న‌డుస్తుంది, ఇక కేంద్రం తాజాగా దీనిపై ఉత్త‌ర్వులు జారీ చేసింది, ఎలాంటి నిబంధ‌న‌లు ఉంటాయో తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

నైట్ కర్ఫ్యూను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సడలించింది. మ‌రో గంట అనుమ‌తి ఇచ్చింది, అంతేకాదు, జోన్ల‌లో కేవ‌లం నిత్య అవ‌స‌రాల‌కు సంబంధించి షాపులు తెర‌చుకోవ‌చ్చు అది కూడా ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇచ్చారు.

ఇక ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు పెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, రాష్ట్ర పరిధిలోని ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడానికి ప్రయాణీకులపై ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వు, అయితే ఆయా స్టేట్స్ వెళ్లాలి అంటే ఈ పాస్ అప్లై చేసుకోవాలి, కాని కేంద్రం వాటిని ఇక తీసేసింది, అలాగే స‌రుకు ర‌వాణాకి సంబంధించి వాహ‌నాల‌కు కూడా ఎక్క‌డా ఆప‌డం ఉండ‌దు.