ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఛార్జీలు తగ్గించిన ఏపీఎస్ఆర్టీసీ

0
66

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 20 శాతం వరకు చార్జీలు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆయా రూట్లు, వాటిలో ఎంత‌మేర చార్జీ త‌గ్గించాల‌న్న విషయాన్ని రీజ‌న‌ల్ మేనేజ‌ర్ల‌కు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో త‌మ ప‌రిధిలోని రూట్లు, వాటిలో తిరిగే బ‌స్సుల్లో చార్జీల త‌గ్గింపున‌కు సంబంధించి జిల్లాల రీజ‌న‌ల్ మేనేజ‌ర్లు వేర్వేరుగా ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తున్నారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం.. విజ‌య‌వాడ‌- హైద‌రాబాద్ ఏసీ బ‌స్సుల్లో 10 శాతం చార్జీల‌ను త‌గ్గించారు. ఈ రూట్లో తిరిగే ఏసీ బ‌స్సులు అమ‌రావ‌తి, గ‌రుడ‌, వెన్నెల బ‌స్సుల్లో ఈ చార్జీల త‌గ్గింపు అమలు కానుంది. విజ‌య‌వాడ‌- విశాఖ మ‌ధ్య న‌డిచే డాల్ఫిన్ క్రూయిజ్‌లో 20 శాతం మేర చార్జీల‌ను త‌గ్గించారు.

అలాగే, విజ‌య‌వాడ నుంచి చెన్నై, బెంగ‌ళూరు వెళ్లే బ‌స్సుల్లోనూ 20 శాతం చార్జీల‌ను త‌గ్గించారు. మ‌రోవైపు అన్ని రూట్ల‌లో అమ‌రావ‌తి, వెన్నెల బ‌స్సుల్లో శుక్ర‌వారం, ఆదివారం మిన‌హా మిగిలిన రోజుల్లోనే చార్జీ త‌గ్గింపు అమ‌లులో ఉంటుంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు.