దేశంలో ఈ నెలలో దసరా దీపావళి పండుగలు వస్తున్నాయి, దీంతో ప్రయాణికులు సొంత ప్రాంతాలకు వెళ్లాలి అని చూస్తారు, ఈ సమయంలో బస్సులు రైళ్లు ప్రయాణాలు చేయాలి అని భావిస్తారు, ఈ సమయంలో అసలే కొద్ది రైళ్లు తిరుగుతున్నాయి, ఈ సమయంలో దసరాకి కొత్త రైళ్లు నడుస్తాయా అనే అనుమానం చాలా మందికి ఉంది.
అయితే తాజాగా క్లారిటీ వచ్చింది..భారతీయ రైల్వే. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 200 ప్రత్యేక రైళ్లు నడపున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.. క్షేత్రస్థాయిలో కరోనా సమస్య తక్కువగా ఉంటే 200 కంటే ఎక్కువ రైళ్లనే నడుపుతామని వీకే యాదవ్ తెలిపారు.
దేశంలో ఏ జోన్లో రద్దీ ఎక్కువగా ఉందో చూసి అక్కడ రైళ్లు ఎన్ని తిరుగుతున్నాయో చూసి దా నిప్రకారం కొత్త రైళ్లు నడపాలి అని భావిస్తున్నారు. ఈ వార్త విని చాలా మంది సంతోషించారు, ఈ కొత్త రైళ్లు గురించి త్వరలో ప్రకటన రానుంది.