మీరు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారా… రైల్వే సమాచారం తెలుసుకోవాలి అని అనుకుంటారా… అయితే రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది… ఇక రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది… 139 నెంబర్కు కాల్ చేస్తే చాలు.. రైల్వే సర్వీసులు అన్నీ పొందొచ్చు. మరి ఈ సర్వీసులు మన దేశంలో 12 భాషల్లో అందుబాటులో ఉంటాయి. - Advertisement -
మీకు ఏదైనా సమాచారం కావాలి అన్నా, విచారణ చేయాలి అన్నా, ఇందులో మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు, ఇక ప్రయాణికులకి ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది…ఇక అనేక రకాల ఫోన్ నెంబర్లు కాకుండా ఒకే ఫోన్ నెంబర్ తో అన్నీ సర్వీసులు పొందవచ్చు. వచ్చే రోజుల్లో 139 నెంబర్ మాత్రమే పనిచేస్తుంది. సమాచారం లేదా ఫిర్యాదులు అన్నీ ఇందులోనే చేయవచ్చు.
|
|
రైల్వే ప్రయాణికులకి గుడ్ న్యూస్ – ఏప్రిల్ నుంచి ఈ నెంబర్ మాత్రమే అన్నింటికి
-