రాజమౌళి ‘RRR’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ

Good news for Rajamouli RRR movie by Telangana government

0
98

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్.తాజాగా ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుద‌ల కాబోతున్నట్టు తెలిపారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం.

తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. సినిమా టికెట్ రేట్లు పెంచుతూ.. తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 , తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్ థియేటర్లు, ఐమాక్స్ లలో మొదటి మూడు రోజు రూ.100, తర్వాత వారం రోజులు రూ.50 పెంచుకునే అవకాశం ఇచ్చింది.  సినిమాకు మార్చి 25వ తేదీనుంచి 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది.