రేషన్ కార్డుదారులకు గుడ్‌ న్యూస్..ఆ గడువు పొడిగింపు

0
92

రేషన్‌ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒకటే దేశం ఒకటే రేషన్‌ కార్డు పథకాన్ని కూడా ప్రారంభించింది. దీంతో ఒక ప్రాంతానికి చెందిన రేషన్‌ కార్డు దారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం అందించే రేషన్‌ సరుకులను పొందవచ్చును. వీటితో పాటు గా కేంద్రం అందించే అనేక పథకాలను రేషన్‌ కార్డు దారులు పొందుతున్నారు.

తాజాగా రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఊరట కలిగే ప్రకటన చేసింది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు అనుసంధానానికి గడువు పొడిగించింది కేంద్రం. దీనితో రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానికి 2022 జూన్ 30 వరకు గడువు పొడిగించింది.

ఇది వరకు ఈ గడువు 2022 మార్చి 31గా ఉంది. దీంతో జూన్‌ 30 వ తేదీ వరకు కార్డు దారులు రేషన్‌ సరఫరాలను పొందడంతో.. పాటు ఇతర పథకాలను, ప్రభుత్వ సౌకర్యాలను పొందుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.