రోజాకి గుడ్ న్యూస్ —- సమయం వచ్చేసింది లక్కీ ఛాన్స్

రోజాకి గుడ్ న్యూస్ ---- సమయం వచ్చేసింది లక్కీ ఛాన్స్

0
88

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే అంటే నగరి ఎమ్మెల్యే రోజా పేరు చెప్పాల్సిందే, రెండు సార్లు వైసీపీ తరపున ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు ..తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తారు. అయితే అధికారంలోకి వస్తే ఆమెకి మంత్రి పదవి వస్తుంది అని అందరూ అనుకున్నారు, కాని ఆమెకి మాత్రం మంత్రి పదవి వరించలేదు.

వివిధ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ రోజాకు మొండిచేయి చూపారు. తర్వాత ఆమెకు మరోసారి రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రి పదవి ఇస్తాము అని అన్నారట, అలాగే జగన్ ఆమెకు అత్యంత కీలకమైన ఏపీఐఐసి చైర్ పర్సన్ గా పదవి ఇచ్చారు, కాని మంత్రి పదవిపైన ఆశలు అలాగే ఉంటాయి కదా.

తాజాగా శాసనమండలి సభ్యత్వం ద్వారా మంత్రి పదవులు చేపట్టిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్ తమ మంత్రి పదవులు కోల్పోతున్నారు, ఈ విషయంలో వైయస్ జగన్ ఈ రెండు మంత్రి పదవుల్లో ఒకటి ఎమ్మెల్యే రోజాకు ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. అయితే ఇద్దరూ బీసీ కావడంతో ఒకటి మహిళా నేతకి ఇచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఒకటి రోజాకు మరొక మంత్రి పదవి బీసీకి ఇవ్వాలి అని జగన్ భావిస్తున్నారట.