తెలంగాణ నుంచి ఏపీ కి వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Good news for RTC passengers traveling from Telangana to AP

0
92

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడంతో  పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ నేటి నుంచి ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు రేపటి నుంచి యథావిధిగా నడవనున్నాయి.

ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఏపీలో  తెలంగాణ బస్సులు నడవనున్నాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 వరకు కర్ణాటకలోకి టీఎస్‌ఆర్టీసీ బస్సులు ప్రవేశించనున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ లో …..

కరోనాతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి చాలా రంగాలు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు జనం. సంస్దలు కూడా దారుణమైన పరిస్దితిలో ఉన్నాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కంపెనీలు సంస్ధల్లో కూడా పరిస్ధితి ఇలాగే ఉంది. ఏపీఎస్ఆర్టీసీ కూడా కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంది.

ఏపీలో కరోనా ఆంక్షలతో అధికశాతం బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ సడలింపులతో కాస్త ఊరట పొందబోతోంది. సోమవారం నుంచి దూరప్రాంత సర్వీసులను పూర్తి స్ధాయిలో నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ ఆంక్షల సడలింపు ఉండటంతో ఈ సమయంలో దూరప్రాంత సర్వీసులు నడవనున్నాయి. వివిధ జిల్లాల మధ్య నడిచే సర్వీసుల సంఖ్య పెరగనుంది. దీని వల్ల కచ్చితంగా సంస్ధకు లాభాలు వస్తాయి.దూర ప్రాంత సర్వీసులకు టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కూడా సోమవారం నుంచి పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది.