ఎస్బీఐ మన దేశంలోనే అతి పెద్ద బ్యాంకు.. అందుకే తీసుకునే నిర్ణయాలు కూడా చాలా మంది ఆసక్తిగా తెలుసుకుంటారు, ఎలాంటి ఆఫర్లు ఇస్తుంది అలాగే వడ్డీ రేట్లు ఏం తగ్గించింది ఇలా అనేక విషయాలు తెలుసుకోవాలి అని కస్టమర్లు భావిస్తారు, దేశంలో అధిక శాతం మంది వినియోగించే బ్యాంకు కూడా ఇదే.
తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ.
ఇకపై మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ప్రతీ ఒక్కరు మెయింటైన్ చేయాల్సిందే, కాని తాజాగా ఈ నిబంధన తొలగించింది.
అలాగే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది.
దేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్రోత్సాహ చర్యల్లో భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్బీఐ ఖాతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్టున్నట్టు తెలిపింది. దీంతో చాలా మంది జీరో బ్యాలెన్స్ గా తమ ఖాతాలను వాడుకోవచ్చు…అలాగే ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది, ఇకపై నెల నెల1000, అలాగే 2 వేలు- 3 వేలు అకౌంట్లో ఉండాలనే నిబంధన తొలగించారు.