లాక్ డౌన్ లో సీజ్ అయిన వాహనదారులకి గుడ్ న్యూస్

Good news for seized motorists in lockdown

0
121

కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో కొందరు లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు. రోడ్లపైకి వాహనాలతో వచ్చారు. సరైన ఆధారాలు చూపించకుండా అవవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో రోడ్ల మీదకి వచ్చిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు జరిమానాలు విధించారు.

ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో సీజ్ చేసిన వాహనాలను జరిమానాలు చెల్లించి తీసుకెళ్లాలని రాష్ట్ర పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఎవరి వాహనాలు సీజ్ లో ఉన్నాయో వారు వచ్చి జరిమానాలు చెల్లించాలని అప్పుడు వాహనాలు తీసుకువెళ్లాలి అని తెలిపింది.

దీనిపై డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. జరిమానాలు ఈ-చలానా ద్వారా చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చని చెప్పారు. వాహనాల కోసం ఎదురుచూస్తున్న వారు ఇక వెళ్లవచ్చు