Flash: విద్యార్థులకు శుభవార్త..తొలిసారి బెటర్‌మెంట్‌ అవకాశం

0
143
CM Jagan

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలిసారి పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రమే బెటర్‌మెంట్‌ అవకాశం ఉంది. కాగా, రెండేళ్ల కోవిడ్‌ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల సౌలభ్య కోసం బెటర్‌మెంట్‌ అవకాశమిస్తూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. 50 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏదైనా రెండు సబ్జెక్ట్‌లకు సప్లిమెంటరీలో బెటర్‌మెంట్‌ రాసే అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ.