ఫ్లాష్ న్యూస్…. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఈ గండం తప్పినట్టే

ఫ్లాష్ న్యూస్.... తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఈ గండం తప్పినట్టే

0
79

ఏపీ తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, క‌రోనా పేషెంట్లు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ స‌మయంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కూడా దారుణంగా కేసులు వ‌స్తున్నాయి, ఈ స‌మ‌యంలో మ‌రో గుడ్ న్యూస్ కూడా వినిపించారు అధికారులు.

తెలంగాణలో కరోనా బాధితులంతా కోలుకుంటున్నారని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99శాతంగా ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక మ‌ర‌ణాల శాతం కూడా చాలా త‌క్కువ‌గానే ఉంద‌ని తెలిపారు, దీంతో ప్ర‌జ‌లు ఇది గుడ్ న్యూస్ అని అంటున్నారు.

తెలంగాణలో ఉన్న కరోనా బాధితులలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 9,786 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇక తెలంగాణ‌లో టెస్టులు భారీగా పెంచింది స‌ర్కార్, తాజాగా స‌ర్కార్ ఈ మాట చెప్ప‌డంతో చాలా మంది ప్ర‌జ‌లు ఆనందంలో ఉన్నారు, క‌చ్చితంగా మాస్క్ ధ‌రించి భౌతిక‌దూరం పాటించండి.