తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న బీర్ల ధరలు!

0
38
Best Light Beer

తెలంగాణ మందుబాబులకు శుభవార్త. కరోనా మహమ్మారి నేపథ్యంలో మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ 20 శాతం పెంచింది. అయితే ధరలు పెరిగిన అప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనితో బీర్ పై పది రూపాయలు తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం.

అయినా అమ్మకాలు పెగకపోవడంతో ఇప్పుడు మరోసారి బీర్ల ధరలు తగ్గించేందుకు కసరత్తులు ప్రారంభించింది. త్వరలోనే బీర్ల ధరలను తగ్గిస్తూ అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా నిత్యావసరవస్తు ధరలు, నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కరోనా కష్టకాలంలో బీర్ బాటిళ్లపై కూడా కోవిడ్ సెస్‌ను వసూలు చేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ సెస్‌ను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా బీరు ధరలు తగ్గనున్నాయి.