ఈ ఏడాది మార్చి నుంచి కరోనా కారణంగా స్కూళ్లు మూత బడ్డాయి, ఇక పరీక్షల విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఇక ఇంకా స్కూళ్లు తెరచుకోలేదు 2020-21 అకడమిక్ ఇయర్ కి అయితే దాదాపు ఇప్పటికే 60 శాతం సిలబస్ పూర్తి అవ్వాలి.. కాని ఇంకా బడులు తెరవలేదు, ఇక పదోతరగతి విద్యార్దులు దీని పై ఆందోళన చెందుతున్నారు, తమ విద్యాసంవత్సరం ఏమవుతుందో అని.
అయితే తాజాగాఈ విద్యాసంవత్సరం తరగతులు జరగకపోవడంతో పదో తరగతి పరీక్షల్లో పేపర్లు కుదించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. మొత్తం 11పేపర్లు ఇప్పుడు ఉన్నాయి, వీటిని ఆరుకి కుదించాలి అని భావించి దీనిని ప్రభుత్వానికి ప్రతిపాధనగా విద్యాశాఖ పంపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మే లేదా ఏప్రిల్ లో పరీక్షలు జరుగుతాయి, ఇక సంక్రాంతి తర్వాత స్కూళ్లు తెరిచే అవకాశం ఉంది, ఇక ఒక్కో సబ్జెట్టుకి ఒక్కో పేపర్ ఉంటుంది అని ఈ ఏడాది సమాచారం, ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలు తెరిచిన తర్వాత పనిదినాలను బట్టి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
T