తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త..ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో కీలక నిర్ణయం

Good news for Telangana travelers..RTC MD Sajjanar‌ Another key decision

0
280

తెలంగాణ ఆర్టీసీ ముందే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయాణాకుల కోసం మెరుగైన సేవలు అందిస్తూ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే సజ్జనార్‌ తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు.

ఇక నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బస్టాండ్ లలో వివిధ సేవలకు డబ్బులను యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మహాత్మాగాంధీ బస్​స్టేషన్ (MGBS)లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్​పాస్ కౌంటర్‌లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి.

ఇక జూబ్లీ బస్ స్టేషన్ లోనూ యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ప్రకటించారు. పార్సెల్, కార్గో బుకింగ్, బస్ పాస్ కౌంటర్లలో ఈ సేవలను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ మేరకు సజ్జనార్ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో ఈ సేవలను అన్ని బస్టాండ్లకు ఈ సేవలు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

https://twitter.com/tsrtcmdoffice