టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..స్పష్టత ఇచ్చిన సర్కార్

0
48

పదో తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ లో ఆరు పేపర్లే ఉంటాయని తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో గత రెండేళ్లుగా పదోతరగతి పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం. ఈసారి పరీక్షలపై క్లారిటీ ఇవ్వలేదు.

11 పరీక్షలుంటాయా..6 పరీక్షలకే కుదిస్తుందా అనే అయోమయం టీచర్లు, విద్యార్థుల్లో ఉంది. క్లాసులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పరీక్షలపై క్లారిటీ ఇవ్వకపోవటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆరు పేపర్లే ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే హిందీతో పాటు..ఉర్దూను ద్వితీయ భాషగా ఉత్తర్వుల్లో పేర్కొంది.