తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త..రేపే అకౌంట్లో నగదు జమ

Good news for the farmers of Telangana CM KCR .. ‘Raitubandhu’ funds deposited from that day

0
84

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రేపటి నుంచి రైతుబంధు నిధులను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

రైతుబంధు కోసం దాదాపు రూ. 7,500 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. నగదు బదిలీ కార్యక్రమం ఈ నెల చివరి వరకు కొనసాగనుంది.

గత వానాకాలంలో తొలి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాల భూమి ఉన్నవారికి, మూడో రోజు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్నవారికి రైతుబంధు డబ్బును పంపిణీ చేశారు. ఈ సీజన్ లో కూడా అదే పద్ధతిని అవలంభించాలని అధికారులు భావిస్తున్నారు.