తెలంగాణలో గతంలో రేషన్ పంపిణీ విధానం లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరిచారు, ఇక కచ్చితంగా రేషన్ ఎవరు తీసుకోవాలన్నా వారు బయోమెట్రిక్ వేయాల్సిందే.. కాని బయోమెట్రిక్ విధానం ద్వారా రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు అన్న వాదన వినిపించడంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ఇక ఎవరైనా సరే బయోమెట్రిక్ విధానంతో కాకుండా ఓటీపీ ద్వారా రేషన్ తీసుకోవాలి అని తెలిపింది.
రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా తమ రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని డీలర్ దగ్గరకు వెళ్లిన సమయంలో కచ్చితంగా మొబైల్ తీసుకువెళ్లాలని ఓటీపీ చెబితేనే రేషన్ ఇస్తారు అని తెలిపింది. కాని దీంతో ప్రజల గందరగోళ పరిస్దితులు ఎదుర్కొన్నారు.
దీంతో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది… ఆధార్ కు ఫోన్ నెంబర్, ఐరిష్ కోసం ప్రక్రియ మొత్తం రేషన్ షాపుల్లో నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇక ఎవరూ ఆందోళన కంగారు చెందక్కర్లేదు. ఇక్కడ మొత్తం ప్రక్రియ చేయనున్నారు.