నిరుద్యోగులకు శుభవార్త..ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

0
70

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోర్టుల్లోని ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 500 పోస్టులు భర్తీ చేయనుంది కేసీఆర్ సర్కార్.

దీనికి సంబంధించి నిరుద్యోగుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్మానించింది. కాగ ఉద్యోగాల‌కు విద్య అర్హ‌త‌గా.. డిగ్రీ పూర్తి చూసి ఉండాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిబంధ‌న పెట్టింది. స్టెనో గ్రాఫ‌ర్ ( గ్రెడ్ – 3), జూనియ‌ర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామిన‌ర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ తో పాటు ప్రాసెస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. కాగా ఈ ఉద్యోగాల‌కు వ‌చ్చే 4వ తేదీ వ‌ర‌కు నిరుద్యోగులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది.  కాగ పూర్తి వివ‌రాల‌కు అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/ ను సంప్ర‌దించాలి.