కరోనా సృష్టించి కల్లోలానికి ప్రపంచ ఆర్థక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పేద, బడుగు వర్గాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఉచిత రేషన్ పంపిణీ చేశాయి. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ లో కూడా దీనిని కొనసాగించింది కేంద్ర ప్రభుత్వం.
అయితే, కరోనా తగ్గుముఖం పట్టడం..వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఆ ఉచిత రేషన్ పథకాన్ని ఈ నెలాఖరు తర్వాత నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పొడిగించండి అంటూ ట్విట్టర్ ద్వారా వేడుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. పీఎం ప్రధాని మోదీకి ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
https://twitter.com/ArvindKejriwal