బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారు, అలాగే మారటోరియం ఉపయోగించుకున్న వారికి అలాగే ఎవరైతే సక్రమంగానగదు ఈఎంఐలు పే చేశారో వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.. వడ్డీ మీద వడ్డీ మినహాయింపు అంశానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
కేంద్రం రూ. 2 కోట్ల వరకు రుణాలకు సంబంధించి మారటోరియం గడువులో వడ్డీ మీద వడ్డీ మాఫీ చేయనుంది. ఇక ఈఎంఐ కట్టని వారు సరిగ్గా కట్టిన వారు అందరికి ప్రయోజనం వస్తుంది… మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు చక్ర వడ్డీ మొత్తాన్ని వీటికి అందించనుంది.
ఎంఎస్ఎంఈ, ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్, కన్సూమర్ డ్యూరబుల్స్ రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్, కన్జప్షన్ రుణాలకు కేంద్ర ప్రభుత్వ పథకం వర్తిస్తుంది. ఈనగదు వచ్చే నెల అంటే నవంబర్ 5న ఖాతాల్లో జమ అవుతుంది
ఉదాహరణకు 50 లక్షల హోమ్ లోన్ ఔట్స్టాండింగ్పై రూ. 12,425 ఆదా కానుంది. కేంద్ర ప్రభుత్వం సాధారణ వడ్డీకి, చక్ర వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని కస్టమర్లకు అందించనుది. దీంతో ప్రజలకు కాస్త భారం తగ్గినట్టే.