ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది, ఇక తాజాగా సీఎం జగన్ మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇకపై అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైఎస్ చైర్మన్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. నిన్న దీనిపై ప్రకటన చేశారు అయితే దీనికి ఎలాంటి న్యాయపరైన ఇబ్బందులు లేకుండా ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ కు పంపారు.
ఈరోజు ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, వైస్ చైర్మన్ ల ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఇక నేటి నుంచి ఇది ఏపీలో అమలులోకి వస్తుంది, గురువారం ఏపీలో మేయర్ల ఎంపిక జరగనుంది, ఈలోపు ఆర్డినెన్స్ కు ఆమోదం వచ్చేసింది.
ఆర్డినెన్స్ కు ఆమోదం లభించడంతో అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఫార్ములా అమలు చేయనున్నారు, మైదుకూరు, తాడిపత్రిల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఖాతాలో చేరాయి. మిగిలినవి అన్నీ వైసీపీ గెలుచుకుంది. మరి ఎవరికి ఈ పదవులు వస్తాయో చూడాలి.
ReplyForward
|