పర్యాటకులకు గుడ్ న్యూస్..ప్రారంభమైన పాపికొండలు బోటింగ్

Good news for tourists..Started Papikondalu boating

0
88

దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న పాపికొండల పర్యాటకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏడాదిన్నర కిందట దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో దాదాపు 50 మంది జలసమాధి అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘోర ప్రమాదం అనంతరం పాపికొండల పర్యాటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. గోదావరిలో అన్ని మోటార్‌ బోట్లనూ నిషేధించింది. పర్యాటకుల ప్రాణాలకు భద్రతనిచ్చే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకున్న తరువాతే నదీ పర్యాటకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది.

తాజాగా పాపికొండల బోటింగ్ తిరిగి నేడు ప్రారంభం అయింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, నవంబర్ 07వ తేదీ నుంచి పున:ప్రారంభం కానుండడంతో శనివారం ట్రయల్ రన్ నిర్వహించారు. రెవిన్యూ, ఇరిగేషన్, పర్యాటక, పోలీస్ శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. గోదారమ్మ ఒడిలో గోదారి అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు మంచి అనుభూతి పొందారు.

APTDC వెబ్ సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలి. పెద్దలకు ధర రూ.1250, పిల్లలకు రూ.1050. ఇందులోనే ఉదయం టిఫిన్, భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు/ ఉదయం 7కు టూర్ ప్రారంభమై రాత్రి 8కి ముగుస్తుంది.