ప్రయాణికులకు గుడ్ న్యూస్..అంత‌ర్జాతీయ విమాన సేవ‌లు తిరిగి ప్రారంభం

0
85

అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణికుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కార‌ణంగా అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై కేంద్రం ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. విమానయాన రంగం దాదాపు కుదేలైన పరిస్థితి, కొవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గిన నేపథ్యంలో ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్చి 27 నుంచే రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లయిట్ ఆపరేషన్స్‌ను కొనసాగించవచ్చని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది.