ఈ కరోనా సంక్షోభంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది మార్చి నుంచి మే నెల వరకూ, అయితే అన్ లాక్ సమయంలో ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి దేశంలో ఎక్కడికి అయినా వెళ్లడానికి అనుమతి ఇచ్చింది కేంద్రం.
ఈ సమయంలో కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ స్టేట్ కి రావాలి అంటే కచ్చితంగా ఈ పాస్ ఉండాల్సిందే అనే రూల్ పెట్టాయి, దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.
అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని ఆదేశించారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. దీని వల్ల ఆర్ధికరంగం పై ప్రభావం కూడా పడుతోంది అన్నారు, దీంతో ఇక ఈ పాస్ అనేది రాష్ట్రాలు రూల్ అమలు చేయకపోవచ్చు అంటున్నారు.
ఇప్పటికే జూలై 27న రాష్ట్రాలకు పలు నిబంధనలను సూచించింది కేంద్ర హొంశాఖ. అంతర్రాష్ట్ర రవాణా మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రజలుకానీ, వాహనాలు కానీ వెళ్తే వారికి లేదా వాటికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదని చెప్పింది.