ఉగాదికి ఏపీ ప్రజలకు జగన్ గుడ్ న్యూస్

ఉగాదికి ఏపీ ప్రజలకు జగన్ గుడ్ న్యూస్

0
90

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఉగాదికి ఉచిత ఇళ్లపట్టాలు ఇవ్వరు అని అందరూ భావించారు.. సీఎం జగన్ కూడా దీనిపై ఇక ఏమీ చేయలేరు అని అనుకున్నారు. కాని కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి, ఇక ఏపీలో పేదలకు అందించే ఇళ్ల పట్టాల విషయంలో వైసీపీ ముందు అడుగు వేయనుంది.

మొత్తం 26.6 లక్షల మంది అర్హులుగా తేలారు. వీరికి ఉగాదికి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సర్కారు సిద్దం అవుతోందట..మహిళల పేరుమీద ఇళ్లపట్టాలు ఇప్పటికే ప్రింటింగ్ కూడా చాలా వరకూ పూర్తి అయింది. దాదాపు 10 లక్షల పట్టాలు పూర్తి చేశారట మిగిలినవి కూడా నేటి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు.

ఇక లాటరీ విధానంలోనే అర్హులకి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు.. అయితే ప్రభుత్వం అతి సాధారణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అని తెలుస్తోంది , పెద్ద ఎత్తున ఆర్బాటాలుగా కాకుండా సాధారణంగా ఈ కార్యక్రమం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి, మరి దీనిపై ఏపీ సర్కారు ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి.