మనం బండి – కారు ఏది కొనుక్కున్నా కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాలి.. ఆర్సీ లేకపోతే వాహనంలో ప్రయాణం చేయడం నేరం, ఇక కచ్చితంగా వాహనం నడపాలి అంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సిందే..తాజాగా ఈ కరోనా కేసులు పెరుగుతున్న వేళ చాలా మంది ఈ సర్టిఫికెట్లు డాక్యుమెంట్ల తేదీలు వాలిడిటీ అయిపోవడంతో కంగారు పడ్డారు.
ఈ సమయంలో కేంద్రం వారికి శుభవార్త అందించింది.వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వెహకల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ సహా ఇతర వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది.
ఇది వాహనదారులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి, కరోనా వల్ల వచ్చిన ప్రతికూల పరిస్దితుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు, చాలా మంది రెన్యువల్ చేయించుకోలేకపోయారు, అందుకే వారికి డిసెంబర్ 31 వరకూ సమయం ఇచ్చింది, ఇక మీ వెహికల్ డాక్యుమెంట్లు ఏమైనా ఎక్స్పైరీ అయ్యి ఉంటే.. ఇప్పుడు ఇవి డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయి. ఈలోపు రెన్యువల్ చేయించుకోండి.