గుడ్ న్యూస్..రూ.50తో ఉచిత బస్సు పాస్‌

0
96

తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రూ.50కె ఉచిత బస్సు పాస్‌ అందించనుంది. దీనికి గాను ఆడపిల్లలు 18 ఏళ్లు లేదా పదో తరగతి వరకు, అబ్బాయిలు 12 ఏళ్లు లేదా 7వ తరగతి వరకు రూ.50తో ఉచిత బస్సు పాస్‌ పొందవచ్చని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ బస్సు పాస్‌ విభాగం అధికారి నాగార్జున వెల్లడించారు.

ఈ బస్సు పాస్‌తో విద్యాసంవత్సరం ముగిసే వరకూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని నాగార్జున వివరించారు. విద్యార్థుల పాస్‌లను ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. రూ.10 అదనంగా కాంబినేషన్‌ టిక్కెట్‌ తీసుకుని ఎక్స్‌ప్రెస్‌లో కూడా ప్రయాణించవచ్చని, ఇది అన్ని విద్యార్థి బస్సు పాస్‌ల వారికీ వర్తిస్తుందని చెప్పారు.

అదేవిధంగా బస్సు పాసుల పునరుద్ధరణలో గందరగోళం నెలకొంది. విద్యార్థులు బస్సు పాసులు 5వ తేదీ నుండి 3 రోజుల పాటు ఉచితంగా పునరుద్ధరించుకోవచ్చు. కానీ గడువు ఐపోయాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆలస్యం రుసుముతో వాటిని పునరుద్ధరించుకోవాల్సి వస్తుంది.