సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..వారికి ఫ్రీగా..

0
96

తెలంగాణ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలను ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో రకాల పథకాలను అమలు చేసి పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాజాగా బతుకమ్మ కానుకగా గర్భిణీ మహిళలకు సర్కార్ శుభవార్త చెప్పింది. గర్భిణీ మహిళలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ ఇస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

1,50,000 మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ ఇస్తామని మంత్రి హరీష్ రావు ఈ మేరకు తెలియజేసాడు. తెలంగాణలోని 9 జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా  రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 5 క్యాతల్యాబ్స్ 5, MRI 30 సిటీ స్కాన్ లు ఉన్నాయి.

వీటితో పాటు 1020 అధునాతన పరికరాలు ఉన్నాయన్నారు. ఇవి పాడైన సందర్భంలో రిపేర్ కోసం 8888526666 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కొన్ని గంటల్లో పరికరాలను రిపేర్ చేస్తారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకొని కృషి చేస్తున్నామన్నారు హరీశ్ రావు.