మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త..నేడే ఖాతాలో డబ్బులు జమ

0
75
CM Jagan

ఏపీ మహిళలకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఇక ఇప్పటికే వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద రెండు విడతలుగా డబ్బులు జమ చేశారు.

ఇక తాజాగా నేడు మూడో విడత డబ్బులు జమ కానున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం. 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకొని అనంతరం 10.45 – 12.15 గంటల వరకు సీఎం బహిరంగ సభ ఉండనుంది.

అనంతరం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తూ పోతే ఐదేళ్లపాటు ఇలా 75 వేలు చేతిలో ఉంటుందన్న మాట. ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.