ఏపీ సర్కార్ శుభవార్త..కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్!

0
122

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈ కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ అలాగే జిల్లా కలెక్టర్ల పూల్ కింద చేపడతారని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

మంగళవారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు ఈ మేరకు ఉత్తర్వులు చేశారు. కాగా ఇటీవల తెలంగాణాలో కూడా కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో వేయడానికి ముందు సర్వీస్ లో 896 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కారుణ్య నియామకలకు సంబంధించిన విషయాన్ని ఎన్‌ఎంయూ, ఈయూ, వైఎస్సార్‌ పీటీడీ అసోషియేషన్, ఎస్‌డబ్ల్యూ ఎఫ్‌ నేతలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

2016 నుంచి పెండింగ్‌ లో ఉన్న 896 కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కారుణ్య నియామకాల జాబితానను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ఆ తర్వాత ఈ లిస్ట్‌ ఫైనల్‌ కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.