గుడ్ న్యూస్, నేడు కూడా పుత్తడి ధర భారీగా తగ్గింది. వరుసగా నాలుగు రోజులుగా బంగారం ధర తగ్గింది.., పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అయితే ఇంకా బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గాయి.. శుక్రవారం బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే తగ్గుదల కనిపించాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 47,550 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 600 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,870 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు మరింత కిందికి దిగివచ్చాయి. వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర ఈరోజు 2000 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 57 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. ..ఇంకా వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్లలో పెట్టుబడులు మధుపరులు పెట్టడంతో భారీగా బంగారం ధర తగ్గుతోంది, వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంటుంది అని అంటున్నారు అనలిస్టులు.