ప్రేమికులకు గుడ్ న్యూస్ …వీహెచ్ పీ, భజరంగ్ దళ్ సంచలన ప్రకటన

ప్రేమికులకు గుడ్ న్యూస్ ...వీహెచ్ పీ, భజరంగ్ దళ్ సంచలన ప్రకటన

0
79

ప్రేమికుల దినోత్సవం..వాలెంటైన్స్ డే …ప్రేమికులకు ఈరోజు పండుగ లాంటిది అనే చెప్పాలి.. ఏడాదిలో ఈరోజు ప్రేమికులు చాలా ఆనందంగా ఉంటారు.. తమ ప్రేమని చెప్పి ఎలాగైనా జయించాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది, మరికొందరు అయితే వివాహం చేసుకునేందుకు ఇది మంచి డేట్ గా చెప్పుకుంటారు.

అయితే ప్రేమికులకి ఈరోజు దేశంలో మాత్రం విరోధులు ఎవరు అంటే, తల్లిదండ్రులకంటే ఎక్కువగా భయపడేది వీహెచ్ పీ, భజరంగ్ దళ్ సభ్యులుకే అనే చెప్పాలి, ఆరోజు ప్రేమికులు కనిపిస్తే వారికి పెళ్లి చేస్తారు.లవర్స్ ఎవరైనా పబ్లిగ్గా కనిపిస్తే వారికి పెళ్లిళ్లు జరిపించే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది

అయితే ఈసారి మాత్రం ఇలా పెళ్లి చేయం అని చెబుతున్నారు ఈ సభ్యులు…ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నామని, ఫిబ్రవరి 14న పార్కులు, పబ్ ల వద్ద అమరవీరుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈసారి ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చేయబోమని, వారితో అమరవీరులకు నివాళులు అర్పించేలా చేస్తామని వెల్లడించారు. దీనిపై పోస్టర్లు విడుదల చేశారు, మొత్తానికి ఈ ప్రకటనతో ప్రేమికులు హమ్మయ్య అనుకుంటున్నారు.