మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీ మహిళలకు వైఎస్సార్ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసేందుకు సిద్ధం అయింది. దీనితో ఏపీ మహిళలకు లబ్ది చేకూరనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పథకానికి అర్హులైన అంటే 45 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఈ పథకం పేరుతో ఏటా రూ.18 వేల 750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తోంది. అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది.
సెప్టెంబర్ 5వ తేదీ వరకు నమోదు ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబర్ 5 వ తేదీ వరకు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖస్తులపై సెప్టెంబర్ 8లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి, అర్హులను గుర్తిస్తారు.