గుడ్ న్యూస్..కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు షురూ

0
99

తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి వివిధ రకాల పథకాలు అమలు చేసి కొంతమేరకు భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుపై ఎంతో మంది పేద ప్రజలు ఆధారపడి జీవనం కొనసాగిస్తుండగా..తాజాగా 57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. ఎంతో మంది వృద్దులు బతకడానికి ఈ కార్యక్రమమే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా తెలంగాణ సర్కార్ మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించి పేద ప్రజలను అబ్బురపరిచారు. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు డయాలసిస్ సేవలు అందేలా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసాడని మంత్రి స్పష్టం చేసాడు.

అంతేకాకుండా నారాయణ పేట్ లో 390 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడానికి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే కారణమని ఈ మేరకు తెలియజేసాడు. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ గారు 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినందుకు మనం గర్వపడాలి తెలిపాడు.